News March 29, 2025
జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా శుక్రవారం నాటికి 1066.20 అడుగులకు తగ్గింది. అదేవిధంగా నీటి నిల్వ కూడా 17.557 టీఎంసీలకు చేరింది. ఎండ వేడికి రోజూ 434 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో తగ్గుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అయితే యాసంగి పంటలకు కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.
News April 3, 2025
నార్త్ సెంటినల్ ఐలాండ్‌లోకి US వ్యక్తి.. అరెస్ట్

అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినల్ దీవిలోకి ఎంటరైన US వ్యక్తి పోల్యకోవ్ (24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతడు అక్కడి గిరిజనులు కంటికి చిక్కలేదు. తిరిగి వచ్చే సమయంలో ఓ మత్స్యకారుడు చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో ధలివాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా సెంటినల్ దీవుల్లోకి ఎవరైనా వెళ్తే అక్కడి గిరిజనులు చంపేస్తారు. భారత ప్రభుత్వం దాన్ని నిషేధిత ప్రదేశంగా గుర్తించింది.
News April 3, 2025
నర్సాపూర్: కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన అంగన్వాడీ సిబ్బంది

నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మండలంలోని కాగజ్ మద్దూర్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లినగుడ్లను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. కుళ్లినగుడ్ల పంపిణీ పై ప్రశ్నిస్తే తమపై దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారిణిని వివరణ కోరగా విచారణ చేపడతామని తెలిపారు.