News April 5, 2025
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక దృష్టి సారించాలి: ఛైర్మన్

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా వారికే కేటాయించాలని, నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
Similar News
News October 19, 2025
దీపావళి: దీపారాధనకు ఏ నూనె ఉత్తమం?

దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల నూనె శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ‘ఆవు నెయ్యి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ నూనె దుష్ఫలితాలు కలగనివ్వకుండా చేస్తుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే దాంపత్యం అన్యోన్యం అవుతుంది. ఆవు నెయ్యిలో వేప నూనె కలిపి వెలిగిస్తే విజయం లభిస్తుంది. అయితే వేరుశెనగ నూనె వాడకూడదు’ అని సూచిస్తున్నారు.
News October 19, 2025
ఎన్నికల రోజు పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే జరిమానా: ఈసీ

ఎన్నికలు జరిగే రోజు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వకపోతే జరిమానా విధిస్తామని యాజమాన్యాలను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఉప ఎన్నికలు జరిగే సెగ్మెంట్లకూ ఇది వర్తిస్తుందని, ఎవరి వేతనాల్లోనూ కోత విధించరాదని సూచించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా పోలింగ్ రోజు ఈ ప్రయోజనం పొందడానికి అర్హులేనని చెప్పింది. దీనిపై రాష్ట్రాలు ఉత్తర్వులు ఇవ్వాలంది.
News October 19, 2025
పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన

పెద్దపల్లి జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు భారీ స్పందన కనిపించింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాల వద్ద శనివారం ఒక్కరోజులోనే 597 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు పెద్దపల్లిలో 325, సుల్తానాబాద్ 249, రామగుండం 373, మంథని 242 మొత్తంగా 1189 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు.