News February 11, 2026

జగిత్యాల: ఐదు మున్సిపాలిటీల పోలింగ్‌పై కలెక్టర్ దృష్టి

image

జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పెల్లి, రాయికల్ మున్సిపాలిటీలలో బుధవారం జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల లోపల ఓటింగ్ సరళి, బయట ఓటర్ల రద్దీని ఆయన గమనించారు.

Similar News

News March 17, 2026

HYD: ఫ్లోర్ కడిగినందుకు రూ.5వేల FINE

image

HYDలో తాగునీటి దుర్వినియోగంపై HMWSSB కఠినచర్యలు చేపట్టింది. జూబ్లీహిల్స్‌ వాసి తాగునీటితో ఫ్లోర్లు కడుగుతుండగా గుర్తించి రూ.5వేల జరిమానా విధించారు. ప్రజల నుంచి వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తాగునీటిని వృథా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

News March 17, 2026

ఖమ్మం: పీఎం ఫసల్ బీమా పథకంపై ఎంపీ ప్రశ్న

image

దేశవ్యాప్తంగా రైతులకు పంట నష్టాల సమయంలో ఆర్థిక భరోసా కల్పించే పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా గత నాలుగేళ్లలో భారీ స్థాయిలో క్లెయిమ్‌లు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి మంగళవారం అడిగిన ప్రశ్నకు మంత్రి భగీరథ్ చౌదరి లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. 2021-22 నుంచి 2024-25 కాలంలో రైతులకు బీమా కంపెనీలు కలిపి రూ.75,450.58 కోట్ల క్లెయిమ్‌లు చెల్లించాయని వివరించారు.

News March 17, 2026

ఈ జీవి పాలు నల్లగా ఉంటాయ్.. ఎందుకంటే?

image

సాధారణంగా ఏ జీవి పాలైనా తెలుపు రంగులో ఉంటాయి. కానీ ఖడ్గమృగం మాత్రం నల్లటి పాలు ఇస్తుంది. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా(0.2%) ఉండటమే దీనికి కారణం. ఇతర జంతువుల పాలలో కొవ్వు ఎక్కువగా ఉండి తెల్లగా కనిపిస్తాయి. కానీ ఖడ్గమృగం పాలలో నీరు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉండటంతో అవి నల్లగా ఉంటాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో