News February 14, 2026

జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తి’

image

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సెక్షన్‌ 163 BNSS అమలులో ఉండటంతో ర్యాలీలు, విజయోత్సవాలు, బాణాసంచా, డీజే వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు.

Similar News

News March 12, 2026

ఎచ్చెర్ల: ఐఐఐటీ కొత్త ఇన్‌ఛార్జ్ డైరక్టర్ ఎవరంటే?

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐఐఐటీ) ఇన్‌ఛార్జ్, డైరెక్టర్‌గా రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్‌ను నియమిస్తూ ఇన్‌ఛార్జ్, ఛాన్సలర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీని రిలీవ్ చేస్తూ ఓ ప్రకటన చేశారు.

News March 12, 2026

యుద్ధం ఎఫెక్ట్.. వరంగల్ జిల్లాలో పెరిగిన వంట నూనె ధరలు!

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో వంట నూనె ధరలు మండిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో ఈ ధరలు లీటరుకు రూ.15-25 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. గతంలో సన్‌ఫ్లవర్ రూ.145-155 ఉండగా ఇప్పుడు రూ.180కి పెరిగింది. పామాయిల్ రూ.100-110 ఉండగా, ఇప్పుడు రూ.160 వరకు పెరిగాయి. వేరుశనగ నూనె రూ.180కి పెరిగింది. హోల్ సెల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్లే వంట నూనె ధరలు పెరుగుతున్నట్లు రిటైల్ వ్యాపారులు తెలిపారు.

News March 12, 2026

16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

image

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.