News February 14, 2026
జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తి’

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సెక్షన్ 163 BNSS అమలులో ఉండటంతో ర్యాలీలు, విజయోత్సవాలు, బాణాసంచా, డీజే వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు.
Similar News
News March 6, 2026
దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.
News March 6, 2026
10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.
News March 6, 2026
పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


