News February 14, 2026

జగిత్యాల: ‘ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తి’

image

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సెక్షన్‌ 163 BNSS అమలులో ఉండటంతో ర్యాలీలు, విజయోత్సవాలు, బాణాసంచా, డీజే వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు.

Similar News

News March 7, 2026

CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

image

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్‌, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 7, 2026

కామారెడ్డి: జర జాగ్రత్త..!

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భిక్కనూరు, మేనూరు, సోమూరు 38.2°C, కొల్లూరు, సదాశివనగర్ 38.1, ఎల్పుగొండ, బీర్కూర్ 38, సర్వాపూర్ 37.8, డోంగ్లి, బీబీపేట 37.7, పుల్కల్, పిట్లం 37.3, మాచాపూర్, గాంధారి, నాగిరెడ్డిపేట 37.2, దోమకొండ 37.1, కామారెడ్డి 37, బిచ్కుంద 36.7, లింగంపేట, లచ్చపేట 36.6, జుక్కల్ 36.5°C ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 7, 2026

పెద్దపల్లి: IAS కోసం పోరాటం.. ఐదో ప్రయత్నంలో సొంతం!

image

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది పెద్దపల్లి జిల్లాకు చెందిన గూడెల్లి సృజన. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలనే కల కన్న ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సివిల్స్ బాట పట్టింది. నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా వెనకడుగు వేయలేదు. గతేడాది గ్రూప్-1లో 35వ ర్యాంక్ సాధించి ప్రస్తుతం డీఎస్పీగా శిక్షణ పొందుతూనే తన ఐదో ప్రయత్నంలో ఆలిండియా 55వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నారు.