News August 14, 2024
జగిత్యాల: ఒకే వేదికపై MLA, MLC, MP

జగిత్యాల పట్టణంలోని 46వ వార్డులో నేడు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య భవనాన్ని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, MLC జీవన్ రెడ్డి, MP ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై వేర్వేరు పార్టీల MLA, MLC, MLC పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి తదితరులు ఉన్నారు.
Similar News
News November 17, 2025
స్టూడెంట్స్ క్లబ్ విధానం స్ఫూర్తిదాయకం: బండి సంజయ్

కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న కలెక్టర్ను ఆయన అభినందించారు.

KNR: ప్రజావాణికి 288 దరఖాస్తులు

సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి 288 అర్జీలను స్వీకరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆమె ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సత్వర పరిష్కారం కోసం అర్జీలను సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.