News February 27, 2025
జగిత్యాల: ఓటు వేసిన కలెక్టర్ దంపతులు

జగిత్యాల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ నం.188లో జిల్లా కలెక్టర్ శ్రీ సత్యప్రసాద్ దంపతులు కలిసి ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
ఉగాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావాలి: కలెక్టర్

జిల్లాలో స్లాబ్ దశలో ఉన్న 2,700 ఇందిరమ్మ ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్‌తో కలిసి ఆయన పనులను సమీక్షించారు. గృహ ప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు స్పష్టం చేశారు.
News February 24, 2026
వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్‌రావుకు మంత్రి దామోదర్ కౌంటర్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కేన్సర్ చికిత్స సహా ఆధునిక సేవలతో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
News February 24, 2026
వరంగల్‌లో హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి దామోదర

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం ఖండించారు. కేవలం భవనాలు కట్టి, జీవోలు ఇస్తే అభివృద్ధి కాదని.. ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది, పూర్తిస్థాయి సౌకర్యాలు ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడమేనని స్పష్టం చేశారు. హరీశ్ రావు విమర్శలు అర్థరహితమని ఆయన మండిపడ్డారు.


