News March 18, 2025

జగిత్యాల: కనుమరుగవుతున్న ఎడ్ల బండ్లు!

image

నాగరికత అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడ్ల బండి. పూర్వం రైతులు ప్రతి అవసరానికి ఎడ్ల బండిని వాడేవారు. ప్రస్తుత రోజుల్లో ఎడ్ల బండి కనుమరుగై మ్యూజియంలో బొమ్మగా మారింది. జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ బండ్లు వచ్చినప్పటి నుండి ఎడ్ల పనులను ఉపయోగించడం తగ్గింది. రైతులు ఎడ్లను తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది.

Similar News

News April 22, 2025

ఏలూరు: ఉపాధ్యాయ పోస్టులకు  అప్లై చేయండి: డీఈవో

image

ఉమ్మడి ప.గో జిల్లాలో 1,035 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని డీఈవో వెంకట లక్ష్మమ్మ సోమవారం తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 15వ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సీబీఐ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in ను పరిశీలించాలన్నారు.

News April 22, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో 604 యూనిట్ల పంపిణీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 604 యూనిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బ్యాంక్, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.

News April 22, 2025

గిల్ పెళ్లిపై ప్రశ్న.. ఆయన ఆన్సరిదే

image

నిన్న KKR-GT మ్యాచ్ టాస్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ పెళ్లి ప్లాన్స్ గురించి అడిగి కామెంటేటర్ డానీ మోరిసన్ నవ్వులు పూయించారు. ‘నువ్వు అందంగా ఉన్నావ్. త్వరలో పెళ్లి చేసుకుంటున్నావా?’ అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ప్రిన్స్ సమాధానమిచ్చారు. కాగా సచిన్ కూతురు సారాతో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించలేదు.

error: Content is protected !!