News August 5, 2024
జగిత్యాల: కనుమరుగైన 2వేల ఏళ్లనాటి రాజన్న ఆలయం
సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం గురించి అందరికీ తెలిసిందే . కానీ, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాంలో ఉన్న మరో ఆలయం గురించి ఎంతమందికి తెలుసు. గ్రామంలో ఉన్న మగ్గాలగడ్డ సమీపంలోని రాజేశ్వరస్వామి ఆలయం ఇది. ఈ ఆలయం సుప్రసిద్ధ చరిత్రను కలిగి ఉంది. ఇది దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయ శిఖరం చాణిక్య/కాకతీయ నిర్మాణం శైలిలో ఉంటుంది. SHARE
Similar News
News September 15, 2024
ఉమ్మడి KNR జిల్లాలో పాఠశాలల వివరాలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఈ విధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 784 పాఠశాలల్లో 98,240 విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 1,071 పాఠశాలల్లో 1,57,648 విద్యార్థులు, జగిత్యాల జిల్లాలో 1,165 పాఠశాలల్లో 1,59,585 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 659 పాఠశాలల్లో 87,390 విద్యార్థులు ఉన్నారు.
News September 15, 2024
KNR: ట్రైన్‌పై రీల్స్.. విద్యుత్ వైర్లు తాకి గాయాలు
రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి యువకుడు గాయాలపాలైన ఘటన WGL జిల్లా కాజీపేటలో శనివారం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. KNR జిల్లా హుజురాబాద్‌కు చెందిన రాజ్ కుమార్(18) కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపై సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. MGMలో చికిత్స అందిస్తున్నారు.
News September 15, 2024
జగిత్యాల: విష జ్వరాలు తగ్గాలని గణపతి హోమం
విష జ్వరాలు తగ్గాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో భరత్‌నగర్ యువసేన ఆధ్వర్యంలో శనివారం గణపతి హోమం నిర్వహించారు. గత రెండు నెలల నుంచి గ్రామంలో విష జ్వరాలతో పాటు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం మహిళలు లక్ష్మీ పూజ, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అనంతరం సామూహికంగా అన్నదానం నిర్వహించారు.