News March 2, 2025
జగిత్యాల కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం మాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ తదితర అధికారులు శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్‌లత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 4, 2025
కెరమెరి: హెచ్ఎంపై దాడి.. వ్యక్తిపై కేసు

కెరమెరి మండలం హట్టి హై స్కూల్ హెచ్ఎం గన్నుపై సోమవారం దినేశ్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు ఎస్ఐ గుంపుల విజయ్ తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్న హెచ్ఎంతో గొడవకు దిగిన దినేశ్ తన జేబులో ఉన్న బ్లేడుతో గాయపరిచాడు. హెచ్ఎం గన్ను ఇచ్చిన ఫిర్యాదు మేరకు దినేశ్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News March 4, 2025
కొత్తగూడెం: ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపు

విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై జిల్లా కలెక్టర్లతో, విద్యాశాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీవోసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందని, నేరుగా ఆన్‌లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు విద్యాశాఖ పరిశీలిస్తుందని అన్నారు.
News March 4, 2025
ఆటో డ్రైవర్లకు నెల్లూరు DSP సూచనలు

ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలని నెల్లూరు నగర డీఎస్పీ సింధు ప్రియా తెలిపారు. నెల్లూరు నగరంలోని రంగనాయకుల గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో 200 మంది ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యతని, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనదారులు ప్రజలకు ఇబ్బందు లేకుండా వాహనాలు నడపాలని సూచించారు.