News February 25, 2026
జగిత్యాల: కలెక్టరేట్‌లో మీ సేవ ఆపరేటర్ల వన్‌డే ట్రైనింగ్

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీ సేవ ఆపరేటర్లకు సదరం/యూడీఐడీ వెబ్‌సైట్ ద్వారా వికలాంగత్వ ధృవీకరణ ప్రక్రియపై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా చేర్చిన 21 కేటగిరీల స్లాట్ బుకింగ్ విధానం, తాత్కాలిక సర్టిఫికేట్ రీ–అసెస్‌మెంట్ స్లాట్ బుకింగ్, UDID సదరం శిబిరాల వివరాలు, పేరు, జనన తేది, ఆధార్ అప్‌డేషన్, E-KYC(ఎస్‌ఓపీ) ప్రక్రియ,ఆన్లైన్ గ్రీవెన్స్ నమోదు విధానాల గురించి తెలిపారు.
Similar News
News April 16, 2026
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై దృష్టి పెట్టాలి

భద్రాద్రి జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ అంకిత్ మండలాల వారీగా పరిశీలించారు. స్లాబ్ స్థాయికి చేరిన ఇళ్లు, పూర్తయిన ఇళ్లు, మార్కింగ్ చేసినవి, ఇంకా మార్కింగ్ చేయని ఇళ్ల వివరాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యం జరిగే చోట తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
News April 16, 2026
విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.