News March 19, 2025
జగిత్యాల: కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ధర్నా

జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు బుధవారం ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతనాలు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఇతర ఉద్యోగుల మాదిరిగా సెలవులు కేటాయించాలన్నారు. వీరికి సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
Similar News
News November 24, 2025
ఖమ్మం: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు పూర్తి

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 571 గ్రామపంచాయతీలకు 5,214 పోలింగ్ స్టేషన్లు, 6,258 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల విధులకు సుమారు14,092మంది సిబ్బంది అవసరమని గుర్తించి, శిక్షణ పూర్తి చేశారు. వీరిలో పోలీంగ్ ఆఫీసర్లు 6,258, ఓపీవోలు 7,834 మందిని నియమించారు.
News November 24, 2025
శత జయంతి ఉత్సవాలు బ్లాక్బస్టర్!

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈనెల 13న మొదలై 23న విజయవతంగా ముగిశాయి. లక్షలాది మంది భక్తులు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు వేడుకల్లో పాల్గొని బాబాను స్మరించుకున్నారు. ఉత్సవాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీ, లేజర్ షో ఈవెంట్స్ భక్తులను మైమరపించాయి. జిల్లా అధికారులు, పోలీసులు, సాయి సేవాదళ్ సభ్యులు విశేష సేవలందించి శత జయంతిని సక్సెస్ చేశారు.
News November 24, 2025
WGL: జల వనరుల సర్వేలు: సీపీవోలే కన్వీనర్లు

వరంగల్లో జల వనరుల గణనలో భాగంగా, గ్రామాల్లోని చెరువుల నుంచి చిన్న చేదబావుల వరకు ప్రతీ నీటి వనరును సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. ప్రతి వనరుకు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ సర్వేకు సీపీవోలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. నీటి నిర్వహణ, సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర డేటాబేస్ను సిద్ధం చేయడమే ఈ గణన ప్రధాన లక్ష్యం.


