News February 19, 2025

జగిత్యాల కలెక్టర్‌తో చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ 

image

ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై మంగళవారం జగిత్యాల కలెక్టర్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా కొనసాగించాలని, రైతు భరోసాపై గ్రీవెన్స్ సెల్‌ను జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 30, 2025

అక్టోబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి మరణం
1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం (ఫొటోలో)
1945: ఐక్యరాజ్యసమితిలో భారత్ సభ్య దేశంగా చేరింది
1987: సినీ దర్శకుడు రాజాచంద్ర మరణం
1990: దర్శకుడు, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
✒ ప్రపంచ పొదుపు దినోత్సవం

News October 30, 2025

మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ కోర్సుల్లో సీట్ల భర్తీకై అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శ్రీహరి రావు తెలిపారు. DMLT 30 సీట్లు, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ 30 సీట్లు కోర్సులకు ఇంటర్‌లో BIPC, MPC, ఆర్ట్స్ గ్రూప్ చదివిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను నవంబర్ 27వ తేదీ వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో అందజేయాలని ఆయన సూచించారు.

News October 30, 2025

NZB: బాబ్లీ ప్రాజెక్టులోకి వరద.. పాక్షికంగా కొన్ని గేట్లు ఎత్తివేత.!

image

నిజమాబాద్ జిల్లాలోని బాబ్లీ ప్రాజెక్టులోకి పైనుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో, అధికారులు పాక్షికంగా కొన్ని గేట్లను ఎత్తివేశారు. వరద ప్రవాహం ఉన్నంత వరకు గేట్లను తెరిచి ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో SRSP SE వి.జగదీష్, AEE కొత్త రవి, CWC EE ఫ్రాంక్లిన్, SDE ఏ.సతీష్, నాందేడ్ EE C.R. బన్సాద్ తదితరులు పాల్గొన్నారు.