News January 26, 2025

జగిత్యాల: కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

image

జగిత్యాల జిల్లాలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బి. ఎస్. లత ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి పతాకవిష్కరణ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణి చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 28, 2026

విద్యా కమిషన్ సిఫార్సులపై తపస్ ఆగ్రహం

image

నూతన విద్యా కమిషన్ సిఫార్సులు ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తపస్ వనపర్తి జిల్లా శాఖ మండిపడింది. ఉపాధ్యాయుల జీతాల హేతుబద్ధీకరణ పేరుతో జీతాలు ఎక్కువగా ఉన్నాయన్న నివేదికను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కార్యదర్శి శశివర్ధన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఆ సిఫార్సులను సవరించాలని డిమాండ్ చేశారు.

News February 28, 2026

గోల్డ్ లోన్ ఎప్పుడు తీసుకోవాలి?

image

మెడికల్ ఎమర్జెన్సీ, అత్యవసర బిజినెస్ అవసరాలు లేదా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడే గోల్డ్ లోన్ తీసుకోవాలి. పర్సనల్ లోన్ దొరకని పరిస్థితుల్లో ఈ లోన్ బెస్ట్ ఛాయిస్. దీన్ని చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు దీనికి మొగ్గు చూపాలి. నెలవారీ ఖర్చులు, వెకేషన్లు, లగ్జరీ వస్తువుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టొద్దు. లేదంటే అధిక వడ్డీ భారంతో పాటు నగలను కోల్పోయే రిస్క్ ఉంటుంది.

News February 28, 2026

వైభవంగా భద్రాచల సీతారామ నిత్య కళ్యాణ వేడుక

image

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు నిర్వహించారు.