News February 5, 2025
జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 19, 2025
విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా కె.అప్పలరాజు

విజయనగరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా కె.అప్పలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ.. కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో, తోటి సిబ్బంది సమన్వయంతో నగరాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా ఆదాయ రాబడిపై దృష్టి సారిస్తానని, పన్ను వసూళ్లు లక్ష్యాలను అధిగమించే దిశగా పని చేస్తానన్నారు.
News February 19, 2025
వసతి గృహాలను తనిఖీ చేసిన MHBD కలెక్టర్

మరిపెడ మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఈరోజు రాత్రి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ హవర్లో ఉన్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి పరీక్షల సంసిద్ధతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల పట్ల భయాన్ని వీడి పరీక్షలు అంటే ఒక అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలన్నారు.
News February 19, 2025
గన్‌ఫౌండ్రీ: ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీఓస్ అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్‌కార్డ్స్, పీఆర్సీ, పెండింగ్ డీఏ సమస్యలు పరిష్కరించాలన్నారు.