News February 16, 2025
జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 28, 2025
కరీంనగర్ DRDOకు ‘స్త్రీనిధి’లో రాష్ట్ర స్థాయి అవార్డు

స్త్రీనిధిలో గత ఆర్థిక సంవత్సరంలో 115 శాతం రుణ పంపిణీ, 90 శాతం రికవరీ చేసినందుకు గాను DRDO కు అవార్డు వచ్చింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా అదనపు DRDO సునీత అవార్డు అందుకున్నారు. కరీంనగర్ DRDO అవార్డ్ అందుకోవడం పట్ల కలెక్టర్ పమేలా సత్పతి డిఆర్డిఓను, సిబ్బందిని అభినందించారు. పేద మహిళలకు స్త్రీనిధి ద్వారా మరిన్ని సేవలు అందించాలని అన్నారు.
News March 27, 2025
డిల్లీ డీసీసీ ప్రెసిడెంట్స్ మీట్‌లో పాల్గొన్న కోమటిరెడ్డి

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే, KCవేణుగోపాల్ సమక్షంలో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో SUDAచైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోని 16 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీని బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తీసుకున్నారు
News March 27, 2025
కరీంనగర్: అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలపై సమావేశం

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి, బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకొని ప్రజాసంఘాల నాయకులు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో జిల్లాధికారులతో కరీంనగర్ కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. వచ్చే నెల 5న బాబు జగ్జీవన్ రావ్ జయంతి, 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.