News February 16, 2025
జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 23, 2025
సూర్యాపేటలో వ్యభిచారం

సూర్యాపేట జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కిరాయి ఇంటిపై రూరల్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాలు నాయక్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించిన పోలీసులు, ఇద్దరిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండ్కు పంపారు.
News October 23, 2025
BREAKING: HYD: విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ పరిధి యమ్నంపేట్లోని ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిచేతన్ రెడ్డి(17) పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. డెడ్బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా?, ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగగా సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వాటిని నిషేధించడం లేక తక్కువ సామర్థ్యం ఉన్నవాటిని అనుమతించడంపై పరిశీలన చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. అటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం ఉంది.