News February 16, 2025

జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 28, 2025

NGKL: రేపు మహనీయుల జాతర సభ సన్నాహక సమావేశం: పృథ్వీరాజ్

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ భవనంలో రేపు ఉదయం 10గంటలకు మహనీయుల జాతర సభ సన్నాహక సమావేశం ఉంటుందని బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జి బండి పృథ్వీరాజ్ తెలిపారు. సమావేశం అనంతరం వాల్ పోస్టర్, కరపత్రం విడుదల కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీల నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News March 28, 2025

NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.

News March 28, 2025

భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

image

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!