News March 1, 2025

జగిత్యాల: కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి శ్రీయాన్స్ అనే మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రగాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాలుడు శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కుక్కలు దాడి చేసి మెడపై గాయపరిచాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Similar News

News December 15, 2025

SDPT: కేసీఆర్ స్వగ్రామంలో ఎవరూ గెలిచారంటే!

image

మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామంలో BRS హావ కొనసాగింది. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి మోత్కు సుమలత శంకర్ 883 ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. మరోసారి చింతమడక ప్రజలు BRSకు ఓట్లు వేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని గ్రామస్థులు తెలిపారు.

News December 15, 2025

VJA: రేపు భవానీపురానికి రానున్న వై.ఎస్ జగన్‌

image

వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 9:20కు బెంగళూరు నుంచి బయలుదేరి 12 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భవానీపురం రానున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు ఇటీవల కూల్చివేసిన 42 గృహాల స్థలాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడతారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం తెలిపింది.

News December 15, 2025

ఆగని పతనం.. ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి

image

రూపాయి పతనం ఆగడం లేదు. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పడిపోతోంది. తాజాగా మరోసారి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 90.75కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 26 పైసలు పతనమైంది. అమెరికాతో ట్రేడ్ డీల్ ఆలస్యం, పెరుగుతున్న వాణిజ్య లోటు, డాలర్లకు డిమాండ్, భారత్‌పై US 50 శాతం టారిఫ్‌లు ఈ క్షీణతకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.