News November 9, 2024
జగిత్యాల: కూల్‌డ్రింక్ అనుకుని పురుగు మందు తాగిన విద్యార్థిని
కూల్‌డ్రింక్ అనుకుని ఓ ఇంటర్ విద్యార్థిని పురుగు మందు తాగింది. ఈ ఘటన రాయికల్ మండలం ఇటిక్యాల ఆదర్శ పాఠశాలలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థినిని జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ మల్యాల మండలంలో షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం.
@ ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ చేయవద్దని మెట్పల్లిలో ధర్నా.
@ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు అందుకున్న కోరుట్ల చిన్నారి.
@ కోరుట్ల పట్టణంలో జర్నలిస్టుల ధర్నా.
News December 12, 2024
KNR: నూతన డైట్ మెనూ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్
కరీంనగర్ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నూతన డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు.
News December 12, 2024
దత్తాత్రేయ దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీ సమేతంగా, దత్తాత్రేయ దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు, పండ్ల రసాలతో అర్చకులు వేదమంత్రాల మధ్య అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు.