News February 17, 2025
జగిత్యాల: కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమం

జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం కొత్త చట్టాలపై అవగాహన, శిక్షణ నిర్వహించారు. పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News March 20, 2025
NLG: ఎంబ్రాయిడరీ వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మార్చి 24 నుంచి మగ్గం వర్క్ (ఎంబ్రాయిడెరీ)లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 సంవత్సరాలలోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 20, 2025
మహబూబ్‌నగర్‌లో AR కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
News March 20, 2025
రాష్ట్రంలో నేడు తేలికపాటి వర్షాలు

ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 22, 23న రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందన్నారు. తెలంగాణలో రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది.