News April 16, 2025

జగిత్యాల కోట గురించి మీకు తెలుసా…?

image

ఎల్గందుల కోటకు అధిపతిగా ఉన్న మారుమల్ల ముల్క్ జాఫరుద్దౌల మీర్జా ఇబ్రహీం ఖాన్ ధింసా క్రీ.శ.1747లో జగిత్యాలలో నక్షత్రం ఆకారంలో ఒక సువిశాలమైన, పటిష్ఠమైన కోటను ఫ్రెంచ్ ఇంజినీర్ల సాంకేతిక సహకారంతో నిర్మించారు. జగిత్యాల కోట రాయి, సున్నంతో నక్షత్రం ఆకారంలో నిర్మితమైంది. ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది నిర్మించి దాదాపు 250ఏళ్లు కావొస్తుంది. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి.

Similar News

News October 17, 2025

ధ‌ర్మ‌వ‌రం పోలీసుల అదుపులో ఉగ్ర‌వాద సానుభూతిప‌రులు?

image

ధర్మవరంలో ఇటీవల అరెస్టయిన ఉగ్రవాద సానుభూతిపరుడు నూర్ మహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతిప‌రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ షేక్ అస్లాం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సజ్జద్ హుస్సేన్‌ల అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నేడు వారిని అరెస్ట్ చూపి రిమాండ్‌‌కు తరలించే అవకాశం ఉంది.

News October 17, 2025

కర్నూలు మోదీ సభ హైలైట్స్

image

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్‌కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా

News October 17, 2025

509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే (OCT 20) సమయం ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.