News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
News November 24, 2025
ADB: భర్త క్రూరత్వం.. భార్యపై ఇనుప పట్టీతో దాడి

తాంసి మండలం కప్పర్లకి చెందిన మల్లెల నరేశ్ తన భార్య లావణ్యపై దాడి చేశాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన నరేశ్, కోపంతో ఇనుప పట్టీతో ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన లావణ్యను కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. ఈ ఘటనపై తాంసి SI జీవన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


