News January 13, 2026
జగిత్యాల: గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్.. 114 పాస్‌పోర్టులు స్వాధీనం

జగిత్యాల పట్టణంలో కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న గల్ఫ్ ఏజెంట్ కాముని గంగాధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 114 పాస్‌పోర్టులు, ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు DSP రఘు చందర్ వెల్లడించారు. పెంబట్లకు చెందిన గంగాధర్ అమాయకులను నమ్మించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారంతో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
కాంగ్రెస్‌లో రాజ్యసభ సీట్లు దక్కేదెవరికో?

TG: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డంతో రాష్ట్రంలోని 2 సీట్లు ఎవరికి దక్కుతాయనే చర్చ జోరందుకుంది. MLAల సంఖ్య ప్రకారం INCకే ఇవి దక్కవచ్చంటున్నారు. ఆ పార్టీ నుంచి K.కేశవరావు, అభిషేక్ సింఘ్వీ, జీవన్ రెడ్డి, హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో BRS RS సభ్యుడిగా ఉన్న KK రాజీనామా చేసి INCలో చేరారు. VH, జీవన్, సుదర్శన్‌లు సీనియర్లు. సింఘ్వీ AICCలో కీలకంగా ఉన్నారు.
News February 18, 2026
సిద్దిపేట: 51 ఏళ్ల తర్వాత.. గురువులకు సన్మానం

గురుశిష్యుల బంధానికి ఈ ఘటన ఒక నిదర్శనం. 51 ఏళ్ల క్రితం తమకు పాఠాలు బోధించిన లెక్చరర్లను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఏడు పదుల వయసు దాటిన మాజీ విద్యార్థులంతా కలిసి ఐఐటీ రామయ్య(Maths), మధుసూదన్(Physics), నాగేశ్వర్ రావు(Chemistry)లను ఆత్మీయంగా సత్కరించారు. సిద్దిపేటకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వినూత్న వేడుకలో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
News February 18, 2026
వరి పంటలో ఎలుకల నిర్మూలనకు అనుకూల సమయం ఏది?

వరిలో నాట్లు వేసిన తర్వాత ఎలుకల నిర్మూలన చేపట్టడం సులభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బుట్టలను పెడితే ఎలుకలను సులభంగా నిర్మూలించవచ్చంటున్నారు. పంట చిరుపొట్ట దశలో ఎలుకల నిర్మూలన కష్టంగా మారుతుందని, ఈ సమయంలో బుట్టలతో వాటిని అరికట్టలేమని చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఎలుక కన్నాలను గుర్తిస్తే, పొగ బెట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


