News February 26, 2025

జగిత్యాల: గుండు పిన్ను పై శివుడు, నందీశ్వరుడు

image

మహా శివరాత్రి సందర్భంగా జగిత్యాల వాసి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై శివుడు, నందీశ్వరుడు రూపాలను తీర్చిదిద్ది తన భక్తి భావాన్ని చాటాడు. గుండు పిన్ను తయారు చేసే మిశ్రమం, పెన్సిల్ రంగులను మాత్రమే ఉపయోగించి కేవలం 12 గంటలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 15, 2025

ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

image

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.

News March 15, 2025

గెలవక ముందు జనసేనాని, గెలిచాక ‘భజన’ సేనాని: ప్రకాశ్ రాజ్

image

నిన్న రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన <<15763560>>మాటలపై<<>> నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. పవన్ గెలవక ముందు ‘జనసేనాని’, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా? అని ప్రశ్నించారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టుల్ని ట్వీట్‌కి జత చేశారు.

News March 15, 2025

గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు: వరంగల్ సీపీ

image

కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావిలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వ్యక్తులు ముందుకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని, ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.

error: Content is protected !!