News February 4, 2025

జగిత్యాల: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

image

తెలంగాణ ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 కు గాను అన్ని గురుకులాలలో 5 నుంచి 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించిందని జగిత్యాల జిల్లా సమన్వయ, నోడల్ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈనెల 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయన్నారు.

Similar News

News November 6, 2025

బీస్ట్ మోడ్‌లోకి ఎన్టీఆర్.. లుక్‌పై నీల్ ఫోకస్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్‌లోకి మారనున్నారు. ‘NTR-NEEL’ మూవీ కోసం ఆయన లుక్ పూర్తిగా మారబోతుందని మేకర్స్ ట్వీట్ చేశారు. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తన సినిమాలో ఎన్టీఆర్ హెయిర్ స్టైల్, బియర్డ్‌ ఎలా ఉండాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దగ్గరుండి హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌తో సెట్ చేయించారు. తారక్ లుక్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News November 6, 2025

గద్వాల్: నేడు నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ

image

రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని కలెక్టర్ సంతోష్ గురువారం తెలిపారు. అందులో గద్వాల జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

News November 6, 2025

మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

image

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.