News March 18, 2025

జగిత్యాల :గ్రీవెన్స్ డే లో 14 మంది అర్జీదారులు

image

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 14మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బాధితుల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య పూర్తివివరాలను సమర్పించాలని ఆదేశించారు. బాధితుల సమస్యను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Similar News

News December 6, 2025

కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

image

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.

News December 6, 2025

విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.

News December 6, 2025

ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు‌

image

హైదరాబాద్‌లోని<> ECIL <<>>15 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్-C, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ , సీఎంఏ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు నెలకు రూ.40వేలు, టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌కు రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in/