News March 7, 2025

జగిత్యాల: ఘోరం.. అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ

image

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునుర్ గ్రామంలో శుక్రవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ విషయమై దళిత సంఘాల నేతలు స్పందిస్తూ.. ఇది దేశాన్ని, యావత్ సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 24, 2025

జగిత్యాల: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా?

image

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో జగిత్యాలలో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు పడుతుందా? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగిత్యాలలో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?

News March 23, 2025

గాయపడ్డ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కేటీఆర్

image

కరీంనగర్‌లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్‌కు వివరించారు.

News March 23, 2025

కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!

error: Content is protected !!