News March 26, 2024

జగిత్యాల: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 21, 2025

కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్‌కే : పమేలా సత్పతి

image

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.

News April 21, 2025

కరీంనగర్: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి: బండి

image

భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతోపాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.

News April 21, 2025

వీణవంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్‌లో ఇవాళ ఆటో, బైక్ <<16165881>>ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. అయితే ఆటో, బైక్ ఢీ కొనడంతో కరీంనగర్‌కు చెందిన పేపర్ ఆటో నడిపే నాగరాజు మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!