News February 10, 2025

జగిత్యాల: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 20 ZPTCలు, 216 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

Similar News

News December 5, 2025

కృష్ణా: మెగా PTM-3.0 కార్యక్రమానికి సర్వం సిద్ధం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 2500లకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మెగా PTM-3.0 నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రగతిని తెలుసుకోనున్నారు. గతంలో మాదిరిగానే ఈసారీ భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ గాంధీ హైస్కూల్‌కు దాతలు ఉచితంగా 6 లాప్‌టాప్‌లను అందించారు. జిల్లాలో ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News December 5, 2025

రెండేళ్లలో 6 గ్యారంటీలకు ₹76,382 కోట్లు

image

TG: రెండేళ్ల పాలనలో 6 గ్యారంటీల అమలుకు ₹76,382 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ₹8,402Cr, ₹500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్‌కు ₹700Cr, గృహజ్యోతి ₹3,438Cr, ఇందిరమ్మ ఇళ్లకు ₹3,200 Cr, ఆరోగ్యశ్రీ ₹3,000 Cr, రైతు భరోసా ₹20,616Cr, యంగ్ ఇండియా స్కూళ్లకు ₹15,600Cr ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రెండేళ్లలో 61,379 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది.

News December 5, 2025

కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

image

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.