News February 19, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

@జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @రాష్ట్రస్థాయి పోటిల్లో జగిత్యాల బిడ్డల సత్తా @కలెక్టర్‌తో సీఎస్ వీడియో సమావేశం @గొల్లపల్లి విద్యార్థికి అథ్లెటిక్స్ సిల్వర్ మెడల్ @కథలాపూర్‌లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు @మల్లాపూర్‌లో పర్యటించిన DRDO PD@కొండగట్టులో భక్తుల రద్దీ @జగిత్యాలలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం @కోరుట్ల మల్లన్న జాతరలో పాల్గొన్న MLA సంజయ్
Similar News
News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
News March 27, 2025
మందమర్రి: రెండు లారీలు ఢీ.. ఒకరికి గాయాలు

మందమర్రి సమీపంలోని సోమగూడెం హైవేపై తెల్లవారుజామున రెండు లారీలు ఒకటి వెనుక ఒకటి ఢీకొనగా వెనుక లారీ క్యాబిన్లో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల నుంచి గాయపడ్డ వ్యక్తి బయటికి రావడానికి నానా యాతన పడుతున్నాడు. విషయం తెలుసుకున్న108 సిబ్బంది, పోలీస్ శాఖ, హైవే సిబ్బంది అక్కడి చేరుకొని క్షతగాడ్రుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
News March 27, 2025
భగభాన్ పాలైకి 10ఏళ్ల జైలు శిక్ష విధించిన గుంతకల్ కోర్టు

ఒడిశా రాష్ట్రానికి చెందిన భగభాన్ పాలై అనే వ్యక్తికి గుంతకల్ కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో గంజాయి తరలిస్తూ రైల్వే పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ముద్దాయికి 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.