News February 20, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS

@గంజాయి అమ్ముతున్న 5గురిని పట్టుకున్న పోలీసులు… వివరాలు వెల్లడించిన డిఎస్పీ@మెట్పల్లిలో యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్య@మెట్పల్లిలో అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. 11 లక్షల సొత్తు స్వాధీనం @చిట్టాపూర్‌లో మెకానిక్ షాప్‌కి నిప్పుపెట్టిన దుండగులు @పెగడపల్లిలో భార్య, పిల్లల చావులకు కారణమైన వ్యక్తి రిమాండ్ @మేడిపల్లిలో చికిత్స పొందుతూ మత్స్యకారుడు మృతి @కొడిమ్యాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
Similar News
News October 31, 2025
రాజమండ్రి: నవంబర్ 1 నుంచి స్వాభిమాన్ ఉత్సవాలు

బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్టీ సంక్షేమ, సాధికారిత అధికారి కె.ఎన్. జ్యోతి తెలిపారు. గిరిజన సమాజ చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక విలువలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. నవంబర్ 1న బిర్సా ముండా జ్ఞాపకార్థం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
News October 31, 2025
సిరిసిల్ల: మిగిలి ఉన్న సీట్ల భర్తీకి కౌన్సిలింగ్

సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతుల నుంచి 9వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీకై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ తెరిసా తెలిపారు. సిరిసిల్లలో శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 4న ఉదయం 11 గంటలకు చిన్న బోనాలలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాజరుకావాలని ఆమె కోరారు.
News October 31, 2025
ఆ మందు లేదన్నందుకు వైన్‌షాప్ క్యాషియర్‌పై దాడి

ఖమ్మం: ఆ మద్యం బ్రాండ్(రాయల్ స్ట్రాంగ్) ఇవ్వలేదన్న కోపంతో వైన్ షాప్ క్యాషియర్‌పై యువకులు దాడి పాల్పడిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలులోని ఓ వైన్ షాప్‌లో పనిచేసే పోలెపొంగు కృష్ణ అనే క్యాషియర్‌పై ఐదుగురు యువకులు తనకు నచ్చిన మధ్యం ఇవ్వాలని అడిగారు. అది లేదనడంతో కోపంతో డాడికి పాల్పడ్డారు. దాడి వీడియోలు సీసీ కెమెరాలు రికార్డు కాగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


