News February 23, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@MLC ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుకు పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం @కోరుట్లలో MLC అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ఆక్సిడెంట్ @మెట్పల్లిలో దొంగతనం కేసులో నిందితునికి 6 నెలల జైలు రూ.200 జరిమానా @వెంపేటలో పసుపు పంటను ఎత్తుకెళ్లిన దుండగులు @ధర్మపురి లో CPR చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు @మెట్పల్లిలో రూ. 6 లక్షల సైబర్ మోసం… నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Similar News
News October 22, 2025
భద్రాద్రి: మిగిలిన సరుకు ఎక్కడ?.. జర భద్రం

దీపావళి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 163 టపాసుల దుకాణాల్లో విక్రయాలు సాగాయి. అయితే, సుమారు 30 శాతం మేర సరకు మిగిలిపోయినట్లు సమాచారం. ఈ మిగిలిన టపాసులను విక్రయదారులు ఎక్కడ నిల్వ చేశారనే దానిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News October 22, 2025
నెల్లూరు: కాలేజీలకు సెలవు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని జూనియర్ కాలేజీలకు సైతం బుధవారం హాలిడే ఇవ్వాలని RIO వరప్రసాద్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
News October 22, 2025
శ్రీకాకుళం: ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈ నెల 19న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో 108 అక్కడికి చేరుకుంది. అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్ సంప్రదించాలన్నారు.