News February 23, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@MLC ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుకు పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం @కోరుట్లలో MLC అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ఆక్సిడెంట్ @మెట్పల్లిలో దొంగతనం కేసులో నిందితునికి 6 నెలల జైలు రూ.200 జరిమానా @వెంపేటలో పసుపు పంటను ఎత్తుకెళ్లిన దుండగులు @ధర్మపురి లో CPR చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు @మెట్పల్లిలో రూ. 6 లక్షల సైబర్ మోసం… నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Similar News
News March 17, 2025
శ్రీసత్యసాయి: పదో తరగతి పరీక్షలకు 210 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షలలో మొదటి రోజు పరీక్షలో 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పెనుకొండ డివిజన్‌లో 129 మంది, ధర్మవరం డివిజన్‌లో 81 మంది గైర్హాజరు అయ్యారన్నారు.
News March 17, 2025
సంగారెడ్డి: మొదటి సంవత్సరం పరీక్షకు 96.71% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.71% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.19,938 మంది విద్యార్థులకు గాను 19,282 మంది విద్యార్థులు హాజరయ్యారని, 656 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 17, 2025
అనంత: ప్రజల నుంచి కలెక్టర్ అర్జీల స్వీకరణ

అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమస్యల అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వీకరించిన అర్జీలను అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.