News March 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబురాలు @ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వోదెల రామకృష్ణ @ మెట్పల్లిలో బీట్ చట్టం రద్దు చేయాలని నిరసన @ షుగర్ ఫ్యాక్టరీపై కోరుట్లలో బీజేపీ నేతల ధర్నా @ సారంగాపూర్ లో ఎండిన పొలం.. కన్నీరు పెట్టుకున్న రైతు @ కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన.

Similar News

News November 22, 2025

పూలు, సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టి సారించాలి: ప్రేమ్ సింగ్

image

నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి, DPT డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ప్రేమ్ సింగ్ శనివారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్, డ్రిప్, పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం పథకాల అమలును ఆయన పరిశీలించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పూలు, సుగంధ ద్రవ్యాల సాగును పెంచాలని సూచించారు. రైతులకు డ్రిప్ పరికరాలను సకాలంలో అందించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.

News November 22, 2025

వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత

image

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక పాత్ర పోషించిన డీసీపీ దార కవితను ప్రభుత్వం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించింది. వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కవిత 2010 గ్రూప్-1లో డీఎస్పీగా చేరారు. ప్రస్తుతం HYD కమిషనరేట్లో డీసీపీగా పనిచేస్తున్నారు. కాగా గతంలో శ్రీనివాస్ అనే అధికారిని నియమించినా, చేరేలోగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో తాజాగా కవిత నియమితులయ్యారు.

News November 22, 2025

అలాగైతే తులం బంగారం, రూ.2,500 ఇచ్చేవాళ్లం: జూపల్లి

image

TG: పథకాల అమలుపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తులం బంగారం, రూ.2,500 ఏమయ్యాయంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పాటు బంగారం ఇవ్వాలంటే మరో రూ.లక్ష అవుతుంది. తులం బంగారం అమలుకు రూ.4వేల కోట్లు, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి రూ.10వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. BRS అప్పులు చేయకుండా ఉండి ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి’ అని అన్నారు.