News March 6, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు @ EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల సంబురాలు @ కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా వోదెల రామకృష్ణ @ మెట్పల్లిలో బీట్ చట్టం రద్దు చేయాలని నిరసన @ షుగర్ ఫ్యాక్టరీపై కోరుట్లలో బీజేపీ నేతల ధర్నా @ సారంగాపూర్ లో ఎండిన పొలం.. కన్నీరు పెట్టుకున్న రైతు @ కలెక్టరేట్ ముందు ఆశా కార్యకర్తల నిరసన.
Similar News
News December 17, 2025
SRH మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.
News December 17, 2025
KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 17, 2025
శ్రీరాంపూర్: సింగరేణి ఇన్‌చార్జి సీఅండ్‌ఎండీగా కృష్ణ భాస్కర్

సింగరేణి సంస్థ ఇన్‌చార్జి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఅండ్‌ఎండీ)గా కృష్ణ భాస్కర్ నియమితులైనట్లు సమాచారం. 2012 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణ భాస్కర్ ప్రస్తుతం ట్రాన్స్‌కో సీఅండ్‌ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగరేణి సీఅండ్‌ఎండీగా ఆయనను ప్రభుత్వం నియమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.


