News January 26, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

1.జిల్లా వ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవం 2.జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పాఠశాలలు, కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ లు 3.రేపు మండలాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో 4 పథకాల అమలు ప్రారంభ కార్యక్రమం 4.ముత్యంపేటలో ఇద్దరికీ కత్తిపోట్లు 5.మెట్పల్లి సిఐ కి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు 6.కొడిమ్యాలలో పెద్దపులి.. గాలిస్తున్న ఫారెస్ట్ అధికారులు 7.జగిత్యాల పాఠశాలలో విద్యార్థులతో స్వీపర్ పనులు

Similar News

News December 13, 2025

బుట్టాయగూడెం: గురుకుల పాఠశాలలో తనిఖీలు

image

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్ శనివారం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

News December 13, 2025

చుంచుపల్లి: మున్సిపాలిటీ-పంచాయతీని వేరు చేస్తున్న హైవే

image

చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ నెలకొన్న భౌగోళిక పరిస్థితి అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తోంది. హైవే మున్సిపాలిటీని, పంచాయతీని వేరు చేస్తోంది.
ప్రశాంతినగర్, కొత్తగూడెం మున్సిపాలిటీలను హైవే విభజిస్తోంది. హైవేకి తూర్పున ఉన్న ప్రాంతం పంచాయతీ పరిధిలోకి రాగా, పడమర ప్రాంతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈ పంచాయతీలో 1633 మంది ఓటర్లు ఉన్నారు.

News December 13, 2025

భూపాలపల్లిలో నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

image

జిల్లాలో మామునూరు, చొప్పదండి నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. భూపాలపల్లి జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 253 మందికి 181 మంది (హాజరు 72.01), కాటారం జడ్పీహెచ్ఎస్ కేంద్రంలో 198 మందికి 133 మంది హాజరైనట్లు డీఈఓ ఎం.రాజేందర్ తెలిపారు. మొత్తం 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.