News March 30, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@పదవి విరమణ పొందిన ఎస్సై, హెడ్ కాన్స్టేబుల్.. సత్కారించిన అదనపు ఎస్పీ @జిల్లాలో 7 పోలీస్ స్టేషన్ల అప్గ్రేడేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ @JGL-KNR కొండగట్టు వద్ద ప్రమాదం.. ఒకరి మృతి @మొగిలిపేట -నడికుడ గ్రామ సరిహద్దుల మధ్య గొడవ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు @దూలరులో సివిల్ రైట్స్ డే కార్యక్రమం
Similar News
News November 18, 2025
పరకామణి చోరీ కేసుపై TTD బోర్డు కీలక నిర్ణయం

తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీలో గతంలో నమోదైన కేసులో పరిమితులు ఉన్నాయని కేసులో రాజీ వెనుక ఉన్న వారిని తేల్చేందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో మరోసారి కేసు నమోదు చేయాలని తీర్మానించారు.
News November 18, 2025
NRPT: రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలని వినతి

వరి ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తెచ్చేందుకు గన్ని బ్యాగులు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో నేతలు మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కార్యదర్శి వెంకట్రాములు మాట్లాడుతూ.. రైతులకు గన్ని బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
News November 18, 2025
SRCL: ఎస్సీ వసతి గృహాల వస్తువులకు టెండర్లు

జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు అందించాల్సిన వస్తువులు, పరికరాల సరఫరా కోసం పిలిచిన టెండర్లను మంగళవారం ఓపెన్ చేశారు. కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సమక్షంలో ఈ టెండర్లను పరిశీలించారు. జామెట్రీ బాక్స్, స్కేల్, వరల్డ్ మ్యాప్, స్టడీ చైర్, దుప్పట్లు, సీసీ కెమెరాలు మొదలైన వస్తువుల సరఫరాకు వచ్చిన దరఖాస్తులను ఆమె పరిశీలించారు.


