News January 28, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@పల్లె ప్రకృతివనం, వైకుంఠదామం, డంపింగ్ యార్డులను తనిఖీ చేసిన కలెక్టర్
@ఇబ్రహీంపట్నం భూతగాదా కేసులో నిందితునికి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా
@కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే
@ధర్మపురి హత్య కేసులో మరొకరి రిమాండ్
@మల్లపూర్ అక్రమ ఇసుక వేలం
@మల్యాలలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
@మల్యాలలో 10వ తరగతి విద్యార్థులకు విషయ అవగాహన సదస్సు
@కొండగట్టులో భక్తుల రద్దీ
Similar News
News December 5, 2025
డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ వినియోగించండి: పెద్దపల్లి కలెక్టర్

పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సిబ్బంది డిసెంబర్ 6న పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శిక్షణ అనంతరం అదేరోజు మ.2 నుంచి సా.6 గంటల వరకు తమ ఓటు నమోదైన మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం-14, ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ తప్పనిసరిగా వెంట ఉంచాలన్నారు. సూచనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు.
News December 5, 2025
రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్కు ఆహ్వానం

రాష్ట్రపతి భవన్లో కాసేపట్లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.
News December 5, 2025
కామారెడ్డి: 10 సర్పంచి స్థానాలు, 433 వార్డు స్థానాలు ఏకగ్రీవం

కామారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. 10 మండలాల పరిధిలోని 167 పంచాయతీలు, 1520 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. జిల్లాలో 10 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, 433 వార్డులు ఏకగ్రీవమైనట్లు జిల్లా పంచాయతీ అధికారి మురళీ శుక్రవారం వెల్లడించారు.


