News February 1, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి క్రైమ్ న్యూస్!
@గొల్లపల్లిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం @మెట్పల్లిలో రెండు బైక్లు ఢీ.. ఒకరి మృతి@గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి దుర్మరణం @కోరుట్లలో బొలెరోని ఢీ కొట్టిన కారు @జగిత్యాలలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య @భూషణరావుపేటలో తాళం వేసిన ఇంట్లో చోరీ @వెల్గటూరు లో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది @మెట్పల్లిలో బైక్ చోరీ.. కేసు నమోదు
Similar News
News February 2, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్ గుప్త, చిట్కూల్‌కు చెందిన సురేశ్ గుప్త కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మేడ్చల్ PS పరిధిలో కంటెయినర్‌ను కారు ఢీకొంది. దీంతో డ్రైవర్ నర్సింహా(28), శంకర్ (46), సురేశ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 2, 2025
అనంతలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య
అనంతపురంలోని పాపంపేట కాలనీలో బాబుల్లా అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
News February 2, 2025
రాత్రి కాజీపేట్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
నేరాల నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడం కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కాజీపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి రైల్వే స్టేషన్‌లో తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులతో పాటు బ్యాగులను తనిఖీ చేశారు.