News February 4, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@జిల్లా వ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు @ప్రపంచ కాన్సర్ డే.. రన్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ @కొండగట్టులో రథసప్తమి వేడుకల్లో.. భక్తుల సందడి @మెట్పల్లి మిషన్ భగీరథ పైప్‌లైన్ పురోగతి పనులను పరిశీలించిన కలెక్టర్ @జగిత్యాల, మెట్పల్లి లో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం @కథలాపూర్లో రెండో విడత దళిత బంధు అమలు చేయాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం @వెల్గటూరు లో ఎస్సై శ్వేతకు కొవ్వత్తులతో నివాళులు

Similar News

News October 16, 2025

వనపర్తి: ‘పోలీస్ విధుల్లో ప్రతిభకు గుర్తింపు’

image

విధుల్లో సమయపాలన, నిజాయితీ పాటించాలని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. గురువారం వనపర్తి సాయుధ పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్లు వినోద్, బారి తమ బాధ్యతలను సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వర్తించినందుకు నగదు రివార్డులు అందజేశారు. సాయుధ దళాల అదనపు ఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

News October 16, 2025

IPS ఆఫీసర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

image

పంజాబ్‌లోని రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌ను CBI అరెస్ట్ చేసింది. ₹8లక్షలు లంచం తీసుకుంటూ ఆయన అధికారులకు పట్టుబడ్డారు. హర్‌చరణ్ ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసి ₹5Cr నగదు, 1.5kgs జువెలరీ, 22 లగ్జరీ వాచ్‌లు, ఆడి, మెర్సిడెస్ కార్లు, గన్స్&పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రేపు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.

News October 16, 2025

గద్వాల: ‘ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలి’

image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఆయన ఎంపీడీవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంశాలు, వస్తున్న సమస్యలపై క్షుణ్ణంగా విశ్లేషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు.అధికారులు పాల్గొన్నారు.