News February 4, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు @ప్రపంచ కాన్సర్ డే.. రన్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ @కొండగట్టులో రథసప్తమి వేడుకల్లో.. భక్తుల సందడి @మెట్పల్లి మిషన్ భగీరథ పైప్‌లైన్ పురోగతి పనులను పరిశీలించిన కలెక్టర్ @జగిత్యాల, మెట్పల్లి లో మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం @కథలాపూర్లో రెండో విడత దళిత బంధు అమలు చేయాలని అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం @వెల్గటూరు లో ఎస్సై శ్వేతకు కొవ్వత్తులతో నివాళులు
Similar News
News February 12, 2025
కావలిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

కావలి పట్టణ శివారు ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై గుండెమడకల రమేశ్ (45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 12, 2025
సిద్దిపేట: పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడి మృతి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు మృతి చెందాడు. వివరాలు.. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డం నవీన్ గౌడ్ (30) మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో అకస్మాత్తుగా మృతి చెందాడని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు అబ్బాయి (1) పాపా (2నెలలు) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
అనంతపురంలో భర్త హత్య.. భార్య మరో ఇద్దరి అరెస్ట్

కాశీ అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. కేసు వివరాలను మంగళవారం వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఈ నెల 2న అనంతపురం రూరల్ పరిధిలో కాశీని ఇద్దరితో కలిసి భార్యే హత్య చేసినట్టు వెల్లడైందన్నారు. నిందితులను ఆర్డీటీ స్టేడియం వద్ద అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు.