News February 5, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ @కొడిమ్యాల లోని నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ @మల్యాలలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రూ.1,27,995 రూపాయల ఆదాయం @జగిత్యాల ఎమ్మెల్యేను కలిసిన దళిత సంఘ నాయకులు @బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న బీర్పూర్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం @ఇకనుంచి జగిత్యాల ఆర్టీసీ కార్గో సేవల్లో హోమ్ డెలివరీ

Similar News

News November 20, 2025

తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

image

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.

News November 20, 2025

దేవ్‌జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

image

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌‌జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్‌‌మెంట్‌‌ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.

News November 20, 2025

నార్సింగి: పల్లె ప్రకృతి వనమా.. డంపింగ్ యార్డా?

image

పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్‌ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు గ్రామస్థులు కోరుతున్నారు.