News February 6, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

image

@జగిత్యాల మాత శిశు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ @కలెక్టరేట్ లో పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం @వెల్గటూరులో విద్యార్థినిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం @ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం @జగిత్యాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆకస్మి తనిఖీలు @కోరుట్లలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం @కొండగట్టు అంజన్నను దర్శించుకున్న జబర్దస్త్ నటులు

Similar News

News February 7, 2025

మాచవరం: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

మాచవరంలో ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నల్లమేకల వెంకటేశ్ అనే వ్యక్తి లైంగిక దాడి చేశారని బాధితురాలు గురువారం మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ అనే యువకుడు తనపై లైంగిక దాడి చేశాడని, తాను కేకలు వేయడంతో పారిపోయాడని, యువతి బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. 

News February 7, 2025

కేజీహెచ్‌లో బాలిక ప్రసవం

image

కేజీహెచ్‌లో 17 ఏళ్ల బాలిక ప్రసవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలిక భీమిలిలోని ఓ హాస్టల్‌లో చదువుతోంది. కడుపునొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా నెలలు నిండని మగబిడ్డ పుట్టి.. చనిపోయినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు విచారణ చేస్తున్నారు. ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరైనట్లు గుర్తించారు.

News February 7, 2025

సిరిసిల్ల: కుక్కల వల్ల చిన్నారికి సోకిన వైరస్

image

కోనరావుపేట(M) కనగర్తికి చెందిన చేపూరి శ్రీమేధ(4) అనే చిన్నారికి జ్వరంతో పాటు శరీరంపై అలర్జీ ఏర్పడింది. అవి ఎక్కువ కావడంతో చిన్నారిని సిరిసిల్లలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అన్నిరకాల పరీక్షలు చేసినా నిర్ధారణ కాకపోవడంతో 4రోజుల క్రితం HYDలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రూసెల్లా ఇథి పీకల్ వైరస్ గా గుర్తించారు. కుక్కల కారణంగా ఈ వైరస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.

error: Content is protected !!