News February 15, 2025

జగిత్యాల: జిల్లాలోని 50 PACS పాలకవర్గాల గడువు పొడిగింపు

image

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువు రేపటితో ముగియనుంది. దీంతో ప్రభుత్వం పాలక వర్గాల గడువును 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. JGTL జిల్లాలో 50 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రస్తుత పాలకవర్గాలకు మరో 6 నెలల పాటు అవకాశం లభించింది. ప్రస్తుత PACSల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటివరకు ఆయా సంఘాల ఛైర్మన్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతారు.

Similar News

News October 20, 2025

జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.

News October 20, 2025

రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు గద్వాల బిడ్డ కెప్టెన్

image

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News October 20, 2025

KMR: RTA చెక్‌పోస్ట్‌లపై ACB మెరుపు దాడి (UPDATE)

image

అవినీతి పాల్పడుతున్న అధికారుల గుండెల్లో ACB రైళ్లను పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలం సలాబత్పూర్ RTA చెక్‌పోస్ట్‌పై దాడి జరిపిన ACB అధికారులు రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, బిక్కనూర్ పొందుర్తి చెక్‌పోస్ట్ వద్ద దాడులు నిర్వహించి రూ.51,300 స్వాధీనం పరుచుకున్నారు. మూడు నెలల వ్యవధిలోనే ఈ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడి జరగడం గమనార్హం.