News February 1, 2025
జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా మల్లాపూర్‌లో 16.9℃, సారంగపూర్ 17.2, జగ్గసాగర్ 17.3, కథలాపూర్, రాఘవపేట, గోదూరు 17.4, మెట్‌పల్లి, మన్నెగూడెం 17.5, కొల్వాయి, మేడిపల్లి 17.6, కోరుట్ల 17.7, నేరెల్ల 18, అల్లీపూర్, బుద్దేష్‌పల్లి, ధర్మపురి 18.1, రాయికల్, ఐలాపూర్ 18.2, పెగడపల్లి 18.3, జైన 18.5, జగిత్యాల 18.8, వెల్గటూర్ 19, గుల్లకోట 19.1, ఎండపల్లి 19.4, పూడూరులో 19.6℃గా నమోదైంది.
Similar News
News February 10, 2025
సుల్తానాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. మృతదేహం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రామగుండం మార్చురీలో ఉందని ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. వివరాలు తెలిస్తే 9949304574, 8712658604 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
News February 10, 2025
మంచిర్యాల RTC బస్టాండ్‌లో ప్రమాదం

మంచిర్యాలలోని RTC బస్టాండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ప్రయాణికుడి కాళ్లపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ప్రయాణికులు తెలిపారు. 2 గంటలుగా బస్సులు లేకపోవడంతో ఒకేసారి బస్సు రావడంతో ప్రయాణికులు ఎక్కడానికి పోటీపడ్డారు. ఈ సందర్భంలో తోపులాట జరిగి ఒకరి కాళ్లు టైర్ల కింద పడ్డాయి.
News February 10, 2025
శ్రీకాకుళంలో పెరుగుతున్న Water Melon విక్రయాలు

శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.