News February 9, 2025
జగిత్యాల జిల్లాలో కీచక టీచర్ అరెస్ట్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లదండ్రులకు చెప్పింది. దీంతో కటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 28, 2025
శ్రీహరికోట: షార్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.
News October 28, 2025
NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.
News October 28, 2025
కురుమూర్తి స్వామికి హనుమద్వాహన సేవ

కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సోమవారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ఆలయం నుంచి కళ్యాణకట్ట, దేవరగుట్ట మీదుగా పూలమఠం వరకు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ఈవో పాల్గొన్నారు.


