News February 9, 2025
జగిత్యాల జిల్లాలో కీచక టీచర్ అరెస్ట్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లదండ్రులకు చెప్పింది. దీంతో కటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 23, 2025
తడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తడ మండలం పెరియావట్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై నుంచి ఉబ్బల మడుగు పర్యాటక కేంద్రానికి వెళుతుండగా కారు చెట్టుకు ఢీకొంది. ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు స్పీడ్ వల్ల నుజ్జు నుజ్జు అయినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News March 23, 2025
షాద్‌నగర్‌లో హాస్టల్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం

షాద్‌నగర్ పట్టణంలోని బాలుర హాస్టల్ పైఅంతస్తు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి దూకాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్‌కి చెందిన చందు ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News March 23, 2025
SRHvRR: టాస్ గెలిచిన RR

ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో SRH ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.