News January 27, 2025

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. మల్యాలలో 14.1℃, మల్లాపూర్, తిరమలాపూర్ 14.6, సారంగాపూర్ 14.7, కొల్వాయి, పెగడపల్లి 15.1, పూడూరు, నేరెల్ల, మెట్పల్లి, కోరుట్ల 15.2, బుద్దేష్‌పల్లి 15.3, జగిత్యాల, రాఘవపేట, మద్దుట్ల 15.4, గోవిందారం, ఐలాపూర్, కథలాపూర్ 15.5, మన్నెగూడెం, గోదూర్ 15.6, జగ్గసాగర్ 15.8, జైన 15.9, రాయికల్ 16, అల్లీపూర్ 16.1, గుల్లకోట, మేడిపల్లి, వెల్గటూర్లో 16.2℃గా నమోదైంది.

Similar News

News September 16, 2025

సిరిసిల్ల: ‘బోర్డు జీవో 12ను ప్రభుత్వం వెంటనే సవరించాలి’

image

భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు జీవో 12ను వెంటనే సవరించాలని బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. సిరిసిల్లలోని శివనగర్ లో సిఐటియు ఆధ్వర్యంలో బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ 3వ మహాసభలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని వివరించారు.

News September 16, 2025

నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

image

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.